అసలు ఇంటి దేవతలు ఎవరు ?
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా కోమట్లు కి కలిపి ఈమే కుల దేవత. అలాగే ఇంటి దేవత & (వంశ దేవత) వేరుగా ఉంటుంది.
మన ఇంటి దేవత పూల కామేశ్వరి. ఒకే ఇంటి పేరు ఉన్నవాళ్ళందరికి ఒకే పేరు ఉన్న ఇంటి దేవత ఉండాల్సిన అవసరం ఉండదు. నరసన్నపేట లో కొందరి వారణాశి కుటుంబాలకు ఇంటి దేవత గుర్రాప్ప. నబరంగపూర్ లో కొందరు పొట్నూరు కుటుంబాలకు ఇంటి దేవత గా దుర్గమ్మ, మరి కొన్ని పొట్నూరు కుటుంబాలకు గుర్రాప్ప ఇంటి దేవత గా ఉంది. అలాగే టెక్కలి లో కొందరు శాసనపురి కుటుంబాలకు పూల కామేశ్వరి ఇంటి దేవత గా కొనసాగుతుంది పూల కామేశ్వరి, అగ్ని కామేశ్వరి, గుర్రాప్ప, దుర్గమ్మ ,....ఇలా అనేక ప్రాంతంల్లో అనేక కుటుంబాలు కి ఇంటి దేవత తప్పక ఉంటుంది. ఈ దేవత కి కనీసం 3 ఏళ్ళకి ఒక్కసారి సంబరం చెయ్యాలి. సంబరాలు ఘనంగా చెయ్యలను కోవడం కాదు ముఖ్యము. సంప్రదాయం ప్రకారం చెయ్యడమే ప్రధాన లక్ష్యం. అగ్ని కామెన్లు కొలిచే కుటుంబాలు ఇతరులను కలపరు. కనీసం ఇంటి ఆడ పడుచు ని కూడా రానివ్వరు. జంతు బలి ఉంటుంది. సంబరాలు తరువాత మిగిలిన ఆహారం కూడా ఎవరూ తినకుండా భూమి లో పాతిపెడతారు. పూల కామెన్లు కి ఈ నిబంధనలు లేవు. మనం ఆడపిల్లల ను కలుపుకు పోతాం. అలాగే జంతు బలి ఉండదు. పూర్తి శాఖాహారం. ఎక్కువ పువ్వులు తో దేవి శాంతింప జేస్తాం పూల కామేశ్వరి ని కొలిచేవారు గురువారం పూజ చేయాలి. మకర సంక్రాంతి కి దేవిని వడపప్పు, చలిమిడి ని నైవేద్యం పెట్టి పూజించాలి. ఆలాగే గురువారం నాన్ వెజ్ తినకూడదు. ఈ ఇంటి కోడళ్లు ఏరోజు కూడా రాత్రులు నాన్ వెజ్ తినకూడదు. అని ఈ దేవత కొలుస్తున్న కుటుంబాలు చెప్పాయి.
పూల కామేశ్వరి ని భక్తి తో కొలిచే కుటుంబాలలో కొన్ని చోట్ల రాత్రులు ఆమె ఇళ్లలో కలియ తిరుగుతోంది అని భావిస్తున్నారు. అందుకే ఆమె నడచినట్లు గజ్జెలు శబ్దాలు విన్నామని పేర్కొంటున్నారు
అస్తిత్వం, నాస్తికత్వం అనే వాదనలు వచ్చినప్పుడు. ఆయా కుటుంబాల్లో నాస్తిక వాదులు ఎప్పుడు అమ్మవారి సంబరాలు ని వ్యతిరేకించలేదు, అడ్డు పడలేదు. ఈ కార్యక్రమం వలన అన్నీ కుటుంబాలు ఒకే చోట చేరుతాయని నాస్తిక వాదులు అభిప్రాయం వ్యక్తం చేయడం హర్షణీయం. టెక్కలి లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమాని కి ఇప్పుడు 50 ఏళ్ళు. తను చిన్నప్పుడు ఇంట్లో అన్నం వాటాలు వేసుకొన్నామని చెప్పాడు. ఒక దాసుడు తమకి దేవత ఉందని చెప్పడంతో తాము ఎంతో కష్టపడి ఈ సంబరాలు చేస్తే ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నామని చెప్పుకొచ్చాడు
పూల కామేశ్వరి అమ్మవారు
కోమట్లు అందరికి కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి. కళింగ కోమట్లు, గవర కోమట్లు (ఆర్య), ఒడియా....
పూర్వం పీర్ సాహెబ్ పేట (కలివరం) వారణాశి ఇంటి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చిన....
సుమారు శతాబ్దం క్రితం నుండి అమ్మవారి సంబరాలు జరగడం లేదు. చాలా మంది వారణాశి కుటుంబాల .....
2019 అక్టోబర్ 19 న వారణాశి సాంబన్న కుమారుడు వారణాశి లచ్చన్న కుమారుడు ....
దాంతో వారణాశి వంశం కోసం వేట మొదలైంది. అనేక రాష్టలు, ప్రాంతాల్లో అన్వేషణ జరపగా ఒక వంశ వృక్షం....
అందుబాటులో ఉన్నవారందరికి సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఉన్న....
తొలి అడుగు వేసినప్పుడు దుంప కల్యాణి (ఎంగిలమ్మ), సారవకోట లక్ష్మీ, వారణాశి వసంత....
అదేరోజు మోహన్ రావు సోదరులు తో కలసి వారణాశి ఢిల్లీప్, మిగతా వారు పీర్ సాహెబ్ పేట....
మార్చి 2న అందరూ కలిసి శ్రీకాకుళం గుడి వీధి తెన్నేటి విక్రమ్ ప్రకాష్ శర్మ ని కలవడం జరిగింది....